భారీగా తగ్గిన ఐడిబిఐ బ్యాంక్‌ ఎన్‌పిఎలు

న్యూఢిల్లీ : ఎల్‌ఐసి, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడిబిఐ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1) 62 శాతం వృద్థితో రూ.1,224 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.756 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.2,448 కోట్లుగా ఉన్న నికర వడ్డీపై ఆదాయం (ఎన్‌ఐఐ) గడిచిన క్యూ1లో 61 శాతం పెరుగుదలతో రూ.3,998 కోట్లకు పెరిగింది. మరోవైపు బ్యాంక్‌ మొండి బాకీలు తగ్గాయి. 2022 జూన్‌ ముగింపు నాటికి 20 శాతంగా ఉన్న బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు.. గడిచిన త్రైమాసికం ముగింపు నాటికి 5 శాతానికి తగ్గడం విశేషం. నికర నిరర్థక ఆస్తులు 1.26 శాతం నుంచి 0.44 శాతానికి పరిమితమయ్యాయి. ఐడిబిఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసిjతీ 49.24 శాతం, కేంద్రానికి 45.48 శాతం, పబ్లిక్‌ షేర్‌హోల్డర్లకు 5.28 శాతం చొప్పున వాటాలున్నాయి.

Spread the love