నవతెలంగాణ-హైదరాబాద్ : ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మార్చి త్రైమాసిక నికర లాభం 134% పెరిగి రూ. 803 కోట్లకు చేరింది. నిర్వహణాదాయం బలంగా నమోదు కావడంతోనే ఇది సాధ్యమైందని బ్యాంక్ తెలిపింది. 2021-22 ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.343 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.2,437 కోట్లకు చేరింది. 2021-22లో ఇది రూ.145 కోట్లు మాత్రమే. బ్యాంక్ ప్రధాన నిర్వహణ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 61% పెరిగి రూ.1,342 కోట్లకు చేరింది. అత్యధిక త్రైమాసిక లాభంతో పాటు 2022-23లో అత్యధిక వార్షిక లాభాన్ని కూడా బ్యాంక్ ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఎస్‌ఐఐ) 30 శాతం పెరిగి రూ.12,635 కోట్లకు చేరింది. 2021-22లో ఇది రూ.9,706 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 3.7 శాతం నుంచి 2.51 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీ ”ఏలు 1.53 శాతం నుంచి 0.86 శాతానికి మెరుగయ్యాయి.