ఆధార్‌ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చాలు.. చెక్‌ అవసరం లేదు: ఈపీఎఫ్‌వో

నవతెలంగాణ హైదరాబాద్‌: ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మార్గం సుగమమైంది. క్లెయిమ్‌తో పాటు చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్‌ తిరస్కరించకుండా చందాదారులకు వెసులుబాటు కల్పించింది. అయితే చందాదారుడి బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ఆమోదించినవారికే ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. చందాదారుడి ఖాతా వివరాలను బ్యాంకు, ఎన్‌పీసీఐ ఆధార్‌ కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్, బ్యాంకు పాసుపుస్తకం జతచేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

Spread the love