బీజేపీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టం ఉండదు

– వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య
నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని పులిగిల్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య శనివారం పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులను ఉద్దేశించే మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టం రద్దు చేస్తారని, అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం నిధులు కుదిస్తూ చట్టాన్ని నీరు కార్చే ఉపాధి హామీ చట్టం లేకుండా చేయడం కోసం అనేక మార్పులు చేర్పులు ఉపాధి హామీలో తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించడం మూలంగా ఉపాధి కార్మికులు పనిచేసిన వాటికి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. గత సంవత్సరం తో పాటు ఈ సంవత్సరం పనిచేసిన కార్మికులకు ఆరేడు వారాల బిల్లులు రాకపోవడం మూలంగా కూలీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఈ చట్టం నిలబడాలంటే తిరిగి పార్లమెంట్లో వామపక్ష ఎంపీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది అందుకోసమే వ్యవసాయ కార్మికులంతా భువనగిరి సిపిఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ కు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. పనిచేసే చోట నీడ, నీరు, ప్రైమరీ చికిత్స కోసం మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీలకు అనుమతిస్తూ 18 /94 జీవోను తీసుకురావడం అని జరిగింది కానీ పని చేసే చోట ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. పంచాయతీ కార్యదర్శుల మీద చర్య తీసుకోవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు.
                                                        ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుండి రూ.300 రూపాయలు కూలి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కానీ  ఎండలో పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ.150 కి మించి రావటం లేదని కరువును తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకొని చట్టం వచ్చినటువంటి నేటి వరకు రెగ్యులర్ గా పని చేస్తున్న కార్మికులకు కొలతలు లేకుండా రూ.300 రూపాయల కూలిని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డి బిక్షపతి,మండల ఉపాధ్యక్షులు వేముల అమరెందర్, మండల కమిటీ సభ్యులు బొడ్డు రాములు,దొడ్డి యాదగిరి,వేముల ముత్తయ్య,కూలీలు లక్ష్మమ్మ,నర్సింహ,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love