ఇవ్ టీజింగ్ చేస్తే షీ టీం కు సమాచారం ఇవ్వండి

నవతెలంగాణ- ఆర్మూర్  

ఇవ్ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాల నీ, ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్‌ టీజింగ్‌ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని షీ టీం కానిస్టేబుళ్లు, విగ్నేష్‌, సుమతి లు అన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల   నందు  సైబర్ క్రైమ్ గురించి శనివారం విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైతే పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు.  షీ టీం నెంబర్‌ 8712659795కు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ  అంజమ్మ  హెడ్ కానిస్టేబుల్ ముత్యంరావు   డబ్ల్యూ పిసి సుకన్య ,కళాశాల ప్రిన్సపాల్  ధన వేణి , ఉపాధ్యాయులు 400  విద్యార్థినిలు  పాల్గొన్నారు.
Spread the love