ఊర్లో అందరికీ మతిమరుపు ఉంటే?

ఊర్లో అందరికీ మతిమరుపు ఉంటే?‘తికమకతాండ’ అనే ఊరిలోని ప్రజలందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని మేకర్స్‌గా గ్రాండ్‌గా నిర్వహించారు.ట్విన్స్‌ హరికష్ణ, రామకష్ణ హీరోలుగా యాని, రేఖ నిరోషా హీరోయిన్లుగా వెంకట దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. నిర్మాతలు సి. కళ్యాణ్‌, దామోదర్‌ ప్రసాద్‌, ప్రసన్న కుమార్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డైరెక్టర్‌ వెంకట్‌ మాట్లాడుతూ, ‘ఒక మంచి సినిమా తీశానని కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’ అని నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు చెప్పారు.హీరోలు హరికష్ణ, రామకష్ణ మాట్లాడుతూ, ‘మా దగ్గర డబ్బు ఉంది కదా అని ఈ సినిమా తీయలేదు. సినిమా మీద మాకు ఉన్న ప్యాషన్‌తో చేశాం. ఈ సినిమా నేను మీకు ఒక స్టెప్పింగ్‌ లాగే చూపిస్తున్నా, మీ కష్టంతో మీరు పైకి ఎదగాలి అని మా నాన్న మాతో చెప్పారు. ఆయన మా పై పెట్టుకున్న నమ్మకాన్ని, అలాగే మా బ్యానర్‌ పేరుని కూడా నిలబెడతాం’ అని తెలిపారు. ఇలాంటి మంచి సినిమాలో మంచి పాత్రలు పోషించడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్లు రేఖ నిరోషా, యాని చెప్పారు. టి ఎస్‌ ఆర్‌ మూవీమేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈచిత్రానికి కథ : నిరూప్‌కుమార్‌, డి ఓ పి : హరికష్ణన్‌, ఎడిటర్‌ : కుమార్‌ నిర్మలాసజన్‌, సంగీత దర్శకుడు : సురేష్‌ బొబిల్లి.

Spread the love