అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే .. ఉద్యోగం తొలగించారు

నవతెలంగాణ – అచ్చంపేట
అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరితే విధుల నుండి తొలగించిన ఘటన బల్మూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుండెకు సంబందించిన వ్యాదితో భాదపడుతున్న నాకు డాక్టర్లు ఆపరేషన్ చేశారు.  డాక్టర్ల సలహా మేరకు ఏడాది పాటు  మందులు వాడుతున్నాను. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాను అని  బాధితురాలు అమరావతి తెలిపిన విరాల ప్రకారం బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. అనారోగ్యానికి గురి కావడం వల్ల ఏడాది పాటు విధులకు హాజరు కాలేదు. మెడికల్ రిపోర్టులు జతచేస్తూ తన ఉద్యోగం తనకు ఇవ్వాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) కి , సీడీపీఓ కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తనకి ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై గత ఏడాది మే నెలలో ప్రజావాణి లో కలెక్టర్ కు కూడా  ఫిర్యాదు  చేశానని గుర్తు చేశారు. అయినప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యానికి ఆసుపత్రిలో ఆరు లక్షలకు పైగా ఖర్చులు అయ్యాయి. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకొని,  జిల్లా కలెక్టర్ తనకు తన ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
Spread the love