– చెప్పుకోవడానికి మేజర్ గ్రామపంచాయతీ
– ఒక్కరోజు కొట్టిన కొద్దిపాటి వర్షానికి రోడ్డంతా బురద మయం
నవతెలంగాణ-ధర్మసాగర్
చినుకు పడితే చిత్తడే అనే చందముగా మేజర్ గ్రామపంచాయతీ ధర్మసాగర్ గ్రామమని చెప్పకనే చెప్పుకోవచ్చు. గురువారం కురిసిన తొలకరి కొద్దిపాటి వర్షానికి మాత్రంమే రోడ్డంతా బురదమయమై చిత్తడి చిత్తడిగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ అసహనాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పుకున్న ఈ రోడ్డు దుస్థితి సమస్య సమస్యగానే మిగిలిపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పూర్తి పరిష్కార మార్గం ఎవరు చేయలేకపోతున్నారు. ఇందుకు సంబంధించి ఈ రోడ్డు మార్గంలో భారీలోడు వాహనాలు ఇసుక మరియు కంకర లోడ్లతో నిత్యం రవాణా కొనసాగుతుండడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తున్న గ్రామపంచాయతీ వేసే మరమ్మతులు నిలువలేక పోతున్నాయి. దీనికి సంబంధించిన ఇరుకులను ఇబ్బందులను ఎదుర్కొంటున్న వడ్డెర, యాదవ కాలనీవాసులు పలు సందర్భాలలో భారీ వాహనాలు నడపొద్దని ధర్నాలు, రాస్తారో కాలు నిర్వహించిన సందర్భాలుగా ఉన్నాయి. ఇందుకు మరో ఉదాహరణగా మట్టి మాఫియా ఈ ప్రాంతం నుండి రాత్రి నుండి మొదలుకొని తెల్లార్లు వరకు నిత్యం కొనసాగుతూ ఉండడం దానిని పట్టించుకున్న నాధుడు లేకపోవడం దురదృష్టకరమని ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియాను అరికట్టాలని స్వయంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన దీనికి సంబంధించిన రెవెన్యూ, మైనింగ్ ఉన్నతాధికారులు మట్టి మాఫియా చేతుల్లో చిత్తయి,చర్యలు చేపట్టలేక చేతులు ముడుచుకుంటూ, మూడుపులకు మడుగులందుతున్నారని ప్రజలు . ఎండగొడితే తినే కంచంలో చేరుతున్న దుమ్ము చేరుతున్నాయని గూడును వెల్లువొచ్చిన పట్టించుకునే నాధులు కరువైపోయారని వాహనదారులు ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలకరి వర్షానికే
నడవలేని పరిస్థితి, భారీ వర్షాలు కొడితే ఇక ఊహించలేమని వాపోతున్నారు. జిల్లాలోనే మేజర్ గ్రామపంచాయతీ, రాష్ట్రస్థాయిలో అవార్డులు రివార్డులు చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది కానీ రోడ్ల పరిస్థితి మాత్రము దేవుడేరుగని గుసగుసలాడుతున్నారు. ఈ ప్రాంతం నుండి పోయే ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు ఏ అధికారులు పట్టించుకోరు పెద్ద పెద్ద మట్టి లారీలు గ్రానైట్ లారీలు మరియు పీచర నారాయణ గిరి నుండి వచ్చిన క్రషర్ హెవీ లోడ్ లారీలు అన్ని ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాస్తవాలను గుర్తించేవారు లేరని చెప్పకనే చెప్పవచ్చు.
1. శాతబోయిన రమేష్. గొర్ల మేకల పెంపకం దార్ల జిల్లా అధ్యక్షులు. అంతుచిక్కని మట్టి మాఫియా తో భారీ వాహనాలు పగలు, రాత్రంతా నడుస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతం
గుంతల మయమై, ఎక్కడ ఎంత లోతు ఉన్నదో తెలియక వృద్ధులు గొంతులో పడిపోయిన సంఘటనలు ఉన్నాయి. అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ రోడ్డుకు గట్టి మరమ్మతులు చేయాలని కోరుతున్నాను.
2. బెల్లం ప్రేమ్ కుమార్ శ్రీకృష్ణ యాదవ సంఘం యూత్ ప్రెసిడెంట్.
ఎన్నిసార్లు మట్టి పోయించి, మరమ్మతులు నిర్వహించిన ఈ ప్రాంతానికి ఫలితం లేకుండా పోతుంది. శాశ్వత మార్గాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించాలని కోరుతున్నాను. ఈ రోడ్డు మార్గంలో నడిచే వాహనాలకు బేరింగ్లు సైతం విరిగిపోయి వాహనాలు చెడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఈ ప్రాంతాన్ని మరమ్మతులకు నిధులు కేటాయించామని చెప్పారు. పనులు మాత్రం ఇప్పటివరకు ప్రారంభించలేదు.
3. సాతబోయిన సంపత్ యాదవ సంఘం సభ్యులు.
ఈ ప్రాంతం గుండా ముఖ్యంగా 2 వీలర్ పై ప్రయాణించే వాహనదారులు రాత్రి వేళలో ఎటు వెళ్ళాలో తెలియక చాలా సార్లు కింద పడిపోయిన సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో గుంతలలో నీరు నిలవడం వల్ల వాహనదారులు ఎటు వెళ్ళాలో తెలియక అయోమయానికి గురైతు గాయాలపాలు అయిన సంఘటనలుగా ఉన్నాయి. వెంటనే ఈ ప్రాంతాన్ని మరమ్మతులు చేయాలని కోరుతున్నాము.