జోకర్లను లీడర్లుగా చేస్తే మనం చూసేది సర్కాసే: ప్రకాష్ రాజ్

if-jokers-are-made-as-leaders-what-we-see-is-sarkase-prakash-raj– సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆవిర్భావం
నవతెలంగాణ – హైదరాబాద్
శరీరానికి గాయాలు అయితే మౌనంగా ఉన్నా మానిపోతాయి. అదే దేశానికి గాయలు అయితే రాచపుండుగా మారి దేశాన్ని కబళిస్తాయని ప్రముఖ సినీనటులు ప్రకాష్ రాజ్ అన్నారు. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆవిర్భావ సభ ప్రముఖ కవయిత్రి, రచయిత్రి కాత్యాయని విద్మహే అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీనటులు, ప్రజాస్వామ్యవాది ప్రకాష్ రాజ్ మాట్లాడతూ… మనం వెళ్తున్న దారిలో రక్తం ఉంది. దాని గురించి రాయాల్సిన బాధ్యత రచయితలపై, కవులపై ఉందన్నారు. పార్లమెంటులో మన ప్రజాప్రతినిధుల మధ్య మాటల గారడీ జరిగిందే తప్ప వందల రోజులుగా మణిపూర్ మండుతుంటే మన స్టేషన్ మాష్టర్ (ప్రధానమంత్రి మోడీ) అది పట్టించుకోవడం లేదన్నారు. జోకర్లను లీడర్లుగా చేస్తే మనం చూసేది సర్కాసే. మలం కులం దేశానికి చాలా ప్రమాదకరం. వాటిని వద్దిలించుకోవాలని పిలుపునిచ్చారు. సమూహకు నేను ఎప్పుడూ సహకారంగా ఉంటానని తెలిపారు. ఈ సభలో అధ్యక్షత వహించిన కాత్యాయని విద్మహే సమూహ లక్ష్యాలు, నియమాలను వివరించారు. ఈ సభకు ప్రముఖ కవి యాకూబ్ సమన్వయకర్త వ్యవహరించారు.

 

Spread the love