మోడీ మూడోసారి అధికారంలోకొస్తే దేశాన్ని అమ్మేస్తాడు: సీపీఐ(ఎం)

– బీజేపీని గ్రామాలలో తిరగకుండా తరిమికొట్టాలి..
– భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి..
– బీజేపీ దేశ సంపదను దోచి  విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు హోల్ సేల్ లో అమ్మేస్తాడు ..
– భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగరాలి..
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
బీజేపీఅధికారంలోకి మూడోసారి వస్తే దేశాన్ని స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు హోల్ సేల్ గా అమ్మేస్తాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు . సోమవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ప్రచారం మునుగోడు మండల కేంద్రంలో కళాకారుల బృందంతో వాడవాడల్లో ర్యాలీ  నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం స్థానిక చౌరస్తాలో  అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూటికి 9% ప్రజల సంపదను వాళ్ల శ్రమను దోషి కొంతమంది చేతిలో పెట్టే విధంగా బీజేపీ  ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు . గత పది సంవత్సరాలుగా బీజేపీ కార్మికులు, రైతు, పేదవాళ్లకు వ్యతిరేక విధానాలను అనుసరించడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పౌర హక్కులను కాపాడుకునేందుకు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెప్పినప్పుడే మనుగడ ఉంటుందని అన్నారు. మోడీ మోసపూరిత మాటలతో మత, దేవుళ్ళ సెంటిమెంటు తో ప్రజలను మధ్యపెట్టి మోసగించి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు . బీజేపీ కి ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఎమర్జెన్సీ తలపించే విధంగా పాలన ఉంటుందని అన్నారు. బీజేపీ నియంతగా పాసిస్ట్ ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు . దేశంలో ఏ పార్టీ మిగలకుండా బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన జైల్లో ఉండాలి .. ఓకే పార్టీ ఓకే మతం అనే నినాదంతో  బీజేపీ కండువా కప్పుకోకుంటే  జైల్లో ఉండాలనే ఆలోచనతో బీజేపీ వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలను విస్మరించి  అంకారపూరితంగా పరిపాలన కొనసాగించిందని అన్నారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన డిమాండ్ చేశారు.
అనంతరం సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ.. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పూటకో పార్టీలు మార్చే నాయకులను ఓడించాలని, మునుగోడు నియోజకవర్గవెనుకబాటుకు కారణం గత పాలకులే కారణమని ఆయన అన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని పాదయాత్రలు, సాగు, త్రాగునీరు కోసం పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం లో ఇండ్ల స్థలాల కోసం, కార్మికుల కోసం, గీత కార్మికుల సమస్యల కోసం, పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడింది కమ్యూనిస్టు లేనని ఆయన అన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి, ఆ స్థానంలో మనుధర్మాన్ని తిసుకోచ్చి ఫ్యూడల్ పద్ధతులు ప్రవేశ పెట్టడం కోసం బీజేపీ కృషి చేస్తుందని, దీని ద్వారా కుల, మత, ప్రాంత విద్వేషాలు సృష్టిస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ద్యేయంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. ఇప్పటికే సిఏఏ, పౌరసత్వరద్దు, జ్యోతిష్యశాస్త్ర అమలు, విద్యా కాషాయికరణ, ఇ.డి, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, వారిని లొంగదీసుకోవడం, మేధావులను జైల్లల్లో పెట్టడం లాంటి వాటిని బలవంతంగా అమలు చేస్తుందన్నారు.
బీజేపీ గత ఎన్నికల ముందు రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పిందన్నారు. నల్ల డబ్బును బయటికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి 15లక్షలు జమ చేస్తామని చెప్పిందన్నారు. ఆమాట ఎక్కడికి పోయిందోనన్నారు మరోవైపు  బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కలిగించిందన్నారు. ఎలెక్ట్రోల్ బాండ్స్ రూపంల్ రూ.1600 కోట్ల రూపాయల అవినీతి జరిగితే  రూ. 800 కోట్ల రూపాయలు బీజేపీకి పార్టీకి చేరాయన్నారు. భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న  బూర నర్సయ్య గౌడ్  భువనగిరి పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి చూయించి ప్రజల్ని ఓట్లు అడగాలని అన్నారు . ఎంపీగా ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే అభివృద్ధి చేయని బూర నర్సయ్యకు ఈ ఎన్నికల్లో ఓటు అడిగి అర్హత లేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థులు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలియని అవగాహన లేని వ్యక్తులని కేవలం ప్రజాబలం లేకుండా ధన బలంతో వస్తున్న వ్యక్తులకు ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు.  గత 35 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా ప్రజా ఉద్యమాలలో ఉండి పోరాడిన తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే నాయకునిగా కాదు సేవకునిగా పనిచేస్తానని అన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలందరికీ సీపీఐ(ఎం) చేసిన పోరాటాలు తెలుసునన్నారు. సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించిపెట్టారన్నారు. నేడు ప్రజలు వాటిని అనుభవిస్తురన్నారని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ ఏర్పడిన 2009 ఎన్నికల నుండి సీపీఐ(ఎం) పోటీ చేస్తుందన్నారు. అందుకే నిరంతరం నిజాయితీగా, నికరంగా, అవినీతికి తావులేకుండా  ప్రజాసమస్యలపై పోరాడే తమ ను ఆశీర్వదించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం , పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట రమణారెడ్డి, పద్మ, కొండ వెంకన్న, మునుగోడు మండల కార్యదర్శి మీర్యల భరత్, సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు, మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, సాగర్ల మల్లేష్, యాట యాదయ్య, కట్ట లింగస్వామి, యాస రాణి వీరయ్య తదితరులు ఉన్నారు.
Spread the love