మోడీ మళ్లీ గెలిస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి : సీఎం స్టాలిన్

నవతెలంగాణ – తమిళనాడు:  ప్రధాని మోడీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళ్తుందని అన్నారు. రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశ చరిత్ర తిరగరాస్తారని అన్నారు. సైన్స్ కూడా వెనక్కి నెట్టివేయబడుతుంది. మూఢనమ్మకాలతో కూడిన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ నియమాలతో భర్తీ అవుతుంది’ అని తెలిపారు. వీటిని ఆపాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఒక్కటే మార్గమని అన్నారు. బీజేపీకి ఓటేస్తే తమిళనాడు శత్రువులకు ఓటు వేసినట్టేనని విమర్శించారు. అలాగే ఏఐఏడీఎంకేకు ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టేనని స్పష్టం చేశారు.

Spread the love