– ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం
– మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ- మల్హర్ రావు: కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఆచరణలో అమలు చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. ప్రచారంలో భాగంగా మహాముత్తారం మండలంలో విస్తృతంగా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు కాంగ్రెస్ మ్యానిఫెస్టో తో రైతులు, యువకులు, మహిళలు, నిరుపేదలకు లబ్ది చేకూర్చేలా రూపొందించామన్నారు. ఆరు గ్యారెంటి పథకాలతో పేదవారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ గెలిచిన వెంటనే 2 లక్షల రుణమాఫీ, అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అధికారం లోకి రాగానే నియోజకవర్గం లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని రాష్ట్ర ఆడపడుచులు పడుతున్న బాధలను చూసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలను ఇంటింటికి చేరవేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు, మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రూ.2,500, రూ.500రూ ల కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసాగా రూ.2 లక్షల రుణమాఫీ ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఏకరానికి రూ.15,000రూ వ్యవసాయ కూలీలకు రూ.12,000రూ, వరి పంటకు 500రూ బోనస్ గృహ జ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి రూ.200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు, ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, యువ వికాసం క్రింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ వృద్ధులకు వితంతులకు రూ.4000 నెలవారీ పింఛన్, రూ.10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ప్రతినెల రూ.4 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
– అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే చేస్తుందని అన్నారు.
– అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే చేస్తుందని అన్నారు.
– చిన్న కాలేశ్వరన్ని చిన్న చూపు చూస్తున్నారు.
– కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన చిన్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
– రైతులకు మెరుగైన కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కి ఉంది.
– కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన చిన్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
– రైతులకు మెరుగైన కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కి ఉంది.
– రైతులకు ఉచితంగా విద్యుత్తును కాంగ్రెస్ ప్రభుత్వమే అందించిందనీ అన్నారు. కరెంటు సమస్యలు రాకూడదని భావించి జైపూర్ విద్యుత్ ప్లాంట్తో పాటు భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ విభజన చట్టంలో క్రిటికల్ అలీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని శ్రీధర్ బాబు అన్నారు. పదేళ్లపాటు అధికారములో ఉన్న కేసీఆర్ చెప్పుకోవడానికి పథకాలు తదితరులు ఏమీ లేక కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తుందన్నారు.