కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం

– బీజేపీ, బీఆర్ఎస్ ల మాయ మాటలు నమ్మొద్దు 
– దుబ్బాకలో చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పనులే 
– భూంపల్లి మండలానికి చెక్ డ్యాంల నిర్మాణం
– ముందు చూపుతో మండలం తెచ్చింది ముత్యంరెడ్డే
– తామే తెచ్చామని చెప్పుకునే నాయకులకు సిగ్గుండాలని ఆరోపణ
– బీజేపీ, బీఆర్ఎస్ దొందు దొందే 
– నన్ను గెలిపిస్తే సిద్దిపేట తరహా దుబ్బాక అభివృద్ధి చేస్తా
– కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ దుబ్బాక రూరల్ / మిరుదొడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే దుబ్బాక ప్రాంతాన్ని సిద్దిపేట తరహా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, బీజేపీ బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఏద్దేవా చేశారు. మంగళవారం అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని బొప్పాపూర్, ఏనగుర్తి, చౌదర్ పల్లి, భూంపల్లి, మోతే, చిట్టాపూర్ గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ చెఱకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని ప్రధాన రహదారి గుండా ర్యాలీ చేసి కచేరీల వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర వస్తే బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసిఆర్ తాగుబోతుల తెలంగాణ చేశాడని, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ కల్పనలో విఫలమైంది. గత ఉప ఎన్నికల్లో కల్ల బొల్లి హామీలు ఇచ్చి యువతను దుబ్బాక ప్రజలను మోసం చేసిన రఘునందన్ రావు గెలిచాక నయ పైస పని చేయలేదని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని మరోసారి ఆపార్టీలకు ఓటేసి మోసపోవద్దని చెఱకు శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కేసిఆర్ అధికారంలోకి వస్తే లావని భూములు స్వాహా చేస్తుందని తాము అధికారంలోకి వస్తే ఆ భూములకు పట్టాలు ఇస్తామని అన్నారు.

దుబ్బాక ఆత్మ గౌరవాన్ని సిద్దిపేటకు తాకట్టు పెట్టే కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రజా సమస్యలు గాలికివదిలేసి మూడేళ్లల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడి కంటే అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటు పడే నాలాంటి రాజకీయ నాయకుడు కావాలో ప్రజలంతా ఆలోచించాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ల మాయ మాటలు మరోసారి దుబ్బాక ప్రజలు నమ్మొద్దని, దుబ్బాక నియోజక వర్గంలో ఎక్కడ చూసినా చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పనులే తప్ప ముందు చూపుతో భూంపల్లి మండలం, చెక్ డ్యాంల నిర్మాణం చేసిన ఘనత స్వర్గీయ ముత్యం రెడ్డిదేనన్నారు. ఇక ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తామంటే తామే తెచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. నన్ను గెలిపిస్తే సిద్దిపేట తరహా దుబ్బాక అభివృద్ధితో పాటు రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇస్తున్నానని చెఱకు శ్రీనివాస్ రెడ్డి వాఖ్యానించారు. అంతక ముందు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాతూరి వెంకట స్వామి గౌడ్ , మండల మహిళా అధ్యక్షురాలు కూతురు సుమలత చందు, మండల అధ్యక్షుడు అక్కపల్లి బాల్ నర్సగౌడ్,ఉపాధ్యక్షుడు గజభింకర్ అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Spread the love