సమస్యలు పరిష్కరించకపోతే సమరశీల పోరాటమే మార్గం

– అంగన్వాడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి 

నవతెలంగాణ కంటేశ్వర్
సమస్యలు పరిష్కరించకపోతే సమరశీల పోరాటమే మార్గం అని అంగన్వాడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్త జీప్ జాతా లో భాగంగా నిజామాబాద్ నగరానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా ధర్నా చౌక్ లో జరిగిన అంగన్వాడి సభలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి మాట్లాడుతూ.. ఐసిడిఎస్ రక్షణ కొరకు, అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల రూపాయల సాధన కొరకు 45వ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ సిఫార్సుల ప్రకారం పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత అమలు కొరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ జరపాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16 నుండి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జీప్ జాతా ద్వారా పర్యటిస్తూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమానికి సన్నద్ధం చేయటంలో భాగంగానే ఈ పర్యటన జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్ కు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కోతను విధిస్తూ కనీస వేతనాలు అమలు కాకుండా నిర్లక్ష్యంగా వివరించడంతోపాటు నూతన జాతీయ విద్యా విధానం వలన ఉద్యోగ భద్రతకే ముప్పు తెచ్చే పద్ధతుల్లో సిఫార్సులు తీసుకురావటం జరిగిందని వీటిని ఉపసంహరించుకోవాలని బడ్జెట్లో నిధులను పెంచాలని డిమాండ్ చేశారు అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు రోజురోజుకీ పని భారం పెంచుతూ పనిగంటలు అమలు జరపకుండా నిత్యం నరకయాతనను పెడుతున్నారని వేతనాలు మాత్రం సరిపడా ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు ఒకవైపు నిత్యవసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచటం జరిగిందని మరొకవైపు కేంద్ర ప్రభుత్వం 2018లో పెంచిన వేతనాలు అమలు జరపకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని 2022లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడీ ఉద్యోగులకు 1972 చట్టం ప్రకారం చెల్లించాలని తెలియజేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలుజారి పెట్టడం లేదని అన్నారు రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టలేదని 2017 నుండి డి ఏ డి ఏ లు చెల్లించడం లేదని అదేవిధంగా ఆన్లైన్లో అనేక యాప్లను పెట్టి పని భారాన్ని పెంచిందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలను పరిష్కరించని యెడల దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోగులా రాష్ట్ర కోశాధికారి సునీత జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవగంగు, పి స్వర్ణ, జిల్లా నాయకులు పి చంద్రకళ, మంగాదేవి, శివరాజమ్మ, పి వాణి. రాజ సులోచన, సూర్య కళ, రాజ్యలక్ష్మి తదితరులతోపాటు పెద్ద ఎత్తున అంగన్వాడి ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర జిల్లా నాయకత్వానికి పూల దండలతో అలంకరించి శాలువాలను సత్కరించటం జరిగింది.

Spread the love