నవతెలంగాణ – హైదరాబాద్: జీవన్‌రెడ్డి మాల్ వారంలోగా తమకు బకాయిలు చెల్లించకపోతే మళ్లీ స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ ఎండా వీసీ సజ్జనార్ తెలిపారు. ‘హైకోర్టు ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో అద్దె సకాలంలో చెల్లించకుంటే ముందస్తు నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకోవచ్చని అన్నారు. మాల్‌లోని సబ్ లీజ్ దారుల ప్రయోజనం దృష్ట్యా ఓపెన్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో నిన్న మాల్ తెరిచేందుకు అనుమతి ఇచ్చాం’ అని ఆయన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.