– సూరి కృష్ణారెడ్డి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
లక్నవరం చెరువు కాలువల గళ్ళను పూడ్చాలని జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో ఇప్పటివరకు రైతులు నాట్లు వేయకపోవడం నార్లు ఎండిపోవడం వ్యవసాయం వెనుకబడిపోవడం వీటికి బాధ్యులు ఎవరు బాధ్యత ఎవరు వహిస్తారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు సూరి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోమవారం మండల కేంద్రంలో లక్నవరం ప్రధాన కాలువల గండ్ల ను పూడ్చాలని 163 వ జాతీయ రహదారిపై రైతుల రస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో ఉద్దేశించి రైతులతో కృష్ణారెడ్డి మాట్లాడారు. ఈ రాస్తారోకోని ఉద్దేశించి సూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జులై 26 కురిసిన భారీ వర్షాలకు లక్నవరం చెరువు కాలువలకు గండ్లు పడి పది రోజులు అయినా నీటిపారుదల శాఖ అధికారులు ఇంతవరకు కాలువ గండ్లు పుడుచలేదని అధికారుల నిర్లక్ష్య వైఖరి ఫలితంగా ఈ రోజున మండలంలో రైతుల వేలాది ఎకరాల నార్లు నాట్లు ఎండిపోయే పరిస్థితి ఉందని దీనికి బాధ్యుడు ఎవరని ప్రశ్నించారు తక్షణమే అధికారులు టెండర్ ప్రకారంగా నామినేట్ పద్ధతిలో వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ టెండర్ కాకుండా నామినేషన్ పద్ధతిలో తక్షణమే గండ్లు పూడ్చే పద్ధతి ఆలోచించాలని కోరారు కాలువగండ్లు పూర్తి చేయడంలో ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని కాకతీయులు నాటి లక్నవరం చెరువు కాలువలు కూడా బాగు చేయలేని గండ్లు పూడ్చలేని పరిస్థితి ప్రభుత్వాల ఏర్పడిందని పేర్కొన్నారు రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభించక పోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకట్ రెడ్డి గుండు రామస్వామి, బొబ్బ సత్తిరెడ్డి, వల్లపు నరసయ్య, లావుడియా హరి, పాపాయిపల్లి సర్పంచ్ దారావత్ రాకేష్, లక్ష్మణ్, మట్ట వెంకట పాపిరెడ్డి, ఏనుగు యాదిరెడ్డి, నరహరి, మోహన్ రెడ్డి, బిక్షం, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.