సమ్మెను విచ్చిన్నం చేస్తే చూస్తూ ఊరుకోము

– అంగన్వాడీలకు అండగా సీపీఐ(ఎం)
– రెండో రోజు సమ్మెను ప్రారంభించిన మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
అంగన్వాడీ సమ్మెను విచ్చిన్నం చేస్తే చూస్తూ ఊరుకోమని, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినా, కోర్కెలను పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పతనం తప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజవర్గ ఇన్‌చార్జి మచ్చా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రెండవ రోజు సమ్మె శిబిరాన్ని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రయత్నిస్తే, స్వయంగా మంత్రే యూనియన్‌లతో చర్చలు జరిపారని అన్నారు. చర్చల్లో అంగీకరించిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ని కుదించారని, ఎటువంటి షరతులు లేకుండా మినీ టీచర్స్‌ని మెయిన్‌ టీచర్స్‌గా గుర్తిస్తామన్న హామీని విస్మరించి, అనేక షరతులతో మినీలను మెయిన్‌ టీచర్స్‌గా గుర్తుస్తామని సర్క్యులర్‌ విడుదల చేశారని అన్నారు. స్వయంగా మంత్రే చర్చల్లో ఇచ్చిన హామీలకు దిక్కే లేకుండా పోయిందన్నారు. వేతనాలు పెంపుదల, పర్మినెంట్‌, ప్రమాద భీమా, జీతంలో సగం పెన్షన్‌గా ఇవ్వడం వంటి సమస్యలపై దాత వేత ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. భద్రాచల పట్టణంలో గ్రామపంచాయతీ ఈవో పోలీస్‌ సహకారంతో అంగన్వాడీ సూపర్వైజర్లు సెంటర్ల తాళాలు పగలగొట్టడం చాలా దుర్మార్గమని, ఈ దాడులు ఆపకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రయత్నాలను విరమించుకొకపోతే వారందరినీ అడ్డుకుని తీరుతామని ఆయన అన్నారు. ధనిక రాష్ట్రంగా గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడానికి ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణా దశాబ్ది ఉత్సవాల పేరిట కోటాను కోట్ల రూపాయలను వృధాగా ఖర్చు చేసిన ప్రభుత్వానికి అంగవాడీల వేతనాలు భారంగా మారాయా అని సూటిగా ప్రశ్నించారు. సీఐటీయూ పట్టణ కోకన్వీనర్‌ మర్లపాటి రేణుక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్‌ ఎంబీ నర్సారెడ్డి, టౌన్‌ నాయకులు ఎన్‌.నాగరాజు రామిరెడ్డి, సీనియర్‌ నాయకులు, బిబిజి తిలక్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు, టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలకు స్థానిక ప్రజల అండ
అంగన్వాడీల సమ్మె విచ్చిన్నానికి ఇతర స్కీం వర్కర్లను ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ ఎత్తుగడలను ఆయా శాఖ స్కీం వర్కర్లు వ్యతిరేకించి అంగన్వాడీల సమ్మెకు మేము అండగా నిలుస్తాం తప్ప సమ్మె విచ్చిన్నానికి ప్రభుత్వం చేతిలో పాములు కామని తేల్చి చెప్పి ఉద్యమ స్ఫూర్తిని చాటారు. వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపటినుండి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని అంగన్వాడి కార్యకర్తలు తేల్చి చెప్తున్నారు.
నిర్భంధం ప్రయోగించడం ఆపాలి
చర్ల : రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు నిర్వహిస్తున్న సమ్మెపై ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా నిర్బంధాన్ని ప్రయోగించటాన్ని సీఐటీ యూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ సమ్మెపై ప్రభుత్వ దౌర్జన్య కాండను నిరసిస్తూ చర్ల మండల కేంద్రంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్రహ్మచారి మాట్లాడారు. దౌర్జన్యంగా అధికారులు తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనపరుచుకునే చర్యలను సీఐటీయూ తప్పుపట్టింది. చట్టబద్ధంగా జరుగుతున్న సమ్మెపై ప్రభుత్వం దౌర్జన్యకాండము పూనుకోవటం హేయమైన చర్యగా సీఐటీయూ పేర్కొన్నది. ఆగస్టు 18వ తారీఖున ఉమ్మడి చర్చల సందర్భంగా మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటమే సమ్మెకు ప్రధాన కారణమని సీఐటీయూ పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ పాయం రాధాకుమారి, అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎం.విజయశీల, సీఐటీయూ మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, నాయకులు కమల మనోహరి, నాగమణి, సావిత్రి, అనసూర్య, సత్యవతి, కృష్ణవేణి, అనురాధ, రాధ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీల సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు
తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మంత్రులకు రూ.3 నుంచి 4లక్షల పైచిలుకు వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌ ద్వారా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న, అనేక ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లకు ఎందుకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వటం లేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం నరేష్‌ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రెండొవరోజు నిర్వహిస్తున్న అంగన్వాడీల సమ్మెకు పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని పేర్కొన్నారు. సమ్మె శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు, బందెల చంటి, దొడ్డి హరినాగవర్మ, నాయకులు సోడి నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) నాయకులు నల్లగట్ల మూర్తి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడి సమ్మెను అనచాలని చూస్తే మరింత ఉధృతం చేస్తాం
కొత్తగూడెం : అంగన్వాడీ సమ్మెను అనచాలని చూస్తే మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.వీరన్న హెచ్చర్చించారు. మంగళవారం అంగన్‌ వాడీల సమ్మె విషయంలో అధికారులు పాల్పడుతున్న చర్యలకు నిర సనగా కొత్తగూడెం బస్టాండ్‌ సెంటర్‌లో అంగన్‌ వాడీలు పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడారు. అంగన్వాడీలకు పోరా డే పటిమ ఉన్నదే తప్ప, పారిపోయే పిరికితనం లేదని ఉద్ఘా టించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు గుర్తిం చాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అంగ న్వాడి జిల్లా నాయకులు జి.పద్మ, కళావతి, మాధవి, శైలజ, సరోజ, పుష్ప, భాగ్యలక్ష్మి, జుబేదా, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : శాంతియుతంగా సమ్మె చేస్తున్న మా పై ప్రభుత్వం తీవ్ర నిర్భంధం ప్రయోగించడం ఆపాలని సీఐటీయూ నుండి అబ్ధుల్‌ నబి, తాళ్లూరి కృష్ణ, ఏఐటీయుసీ నేత దేవరకొండ శంకర్‌, బంధం నాగయ్య అన్నారు. మంగళవారం 2వ రోజు సమ్మె శిబిరాన్ని సీఐటీయూ సీనియర్‌ నేత కూకట్ల శంకర్‌ ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. అంగన్వాడీ నేతలు కల్లెపల్లి మరియ, ఫాతిమా, చాట్ల రాంబాయి,నాగలక్ష్మి వసంత, బత్తుల దేవేంద్ర,కారం పద్మ సుజాత, వెంకట రమణ, యాకమ్మ, సోమ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
దీక్షలకు శ్రీవాణి, చందా సంతోష్‌ సంఘీభావం
మణుగూరు : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్‌ రిటైర్మెంట్‌ వర్తింపజేయాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్‌ రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్‌ నిరువదిక నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగుతున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరంలో కూర్చున్నారు. రెండవ రోజు కాంగ్రెస్‌ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వీనర్‌ చందా సంతోష్‌, సమత్‌, బట్‌ పల్లి సర్పంచ్‌ పోలబోయిన శ్రీవాణి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ శిబిరంలో సంఘీభావానికి వచ్చినవారు ఏఐటీయూసీ నాయకులు అక్కి నరసింహారావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొడిశాల రాములు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు, సీఐటీయూ మండల కన్వీనర్‌ ఉప్పతల నరసింహారావు, అంగన్వాడీ నాయకురాలు హేమలత, వెంకటరమణ, శ్యామల, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే శరణ్యం
దుమ్ముగూడెం : తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్స్‌ సిఐటీయు, ఏఐటీయుసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో పాల్గొనడంతో 90 శాతం అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయని ఇది జీర్ణించుకోలేనిరాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల చేత అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొడుతూ దోపిడీ దొంగల్లా వ్యవహరిస్తున్నారని జీఏజిఎస్‌ రాష్ట్ర సహాయకార్యదర్శి కారం పుల్లయ్య, ఏఐటీయుసి రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్‌ ఆరోపించారు. మంగళవారం లకీëనగరం స్టేట్‌ బ్యాంకు ఎదురుగా అంగన్వాడీలు చేపడుతున్న రెండవ రోజు సమ్మె శిభిరాన్ని వారు సందర్శించారు. అనంతరం స్టేట్‌ బ్యాంకు నుండి లకీëనగరం ప్రదాన సెంటర్‌ మీదుగా ములకపాడు వరకు వందలాది మంది అంగన్వాడీలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు, ఏఐటీయుసి నాయకులు కొండపల్లి శ్రీధర్‌, యాస నరేష్‌, వి.మల్లికార్జున్‌, రామిరెడ్డి, నిమ్మల మధు, కృష్ణవేణి, కమలాదేవి, గజలకీë, రమణ, బేబీ, బుచ్చమ్మ, సరోజిని, శీలం లకీëలతో పాటు వందలాది మంది అంగన్వాడీలు పాల్గొన్నారు.
ములకలపల్లి : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమై డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమ్మెలు విచ్ఛిన్నం చేయడానికి మండల పరిధిలోని మాధారం అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొడుతుండగా సీపీఐ(ఎం) నాయకులు అడ్డుకున్నారు. సమ్మె చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తుల ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అడ్డుకున్న వారిలో పార్టీ నాయకులు వూకంటి రవికుమార్‌, వినోద్‌, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
దమ్మపేట : అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మెకు వ్యతిరేకంగా అధికారులు బెదిరింపులకు పాల్పడితే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఒత్తిడి తెచ్చి సమ్మెలోనే పాల్గొంటామని, ఏటువంటి బెదిరింపులకు భయపడేదే లేదని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు అంగన్వాడీ టీచర్లు హెచ్చరిక జారీ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూరమ్మ, పద్మ, జ్వోతి, తిరుపతమ్మ, వాణి, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, వజ్రమ్మ, శాంతి తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : అధికారులు బెదిరిస్తే, బెదిరిపోమని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీఐటీయూ అనుబంధం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.పద్మ మంగళవారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టేకులపల్లిలో అంగన్వాడీల సమ్మెను రెండవ రోజు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ టేకులపల్లి ప్రాజెక్టు నాయకురాలు కొండపల్లి శకుంతల, ఏఐటీయూసీ వై.ఇందిరా, పద్మ, పి.రాజేశ్వరి, బి.లోకేశ్వరి, ఏం.చాందిని తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : అంగన్‌ వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో అంగన్‌ వాడి టీచర్స్‌, హెల్పర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవదిక సమ్మెకు ఆయన మద్దతు తెలియజేశారు. అనంతరం మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో వామపక్ష అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్లు, ప్రగతి భవన్‌ ముట్టలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వల్లమల్ల చందర్‌ రావు, లకావత్‌ శ్రీను, రెడ్డిబోయిన గోవిందు, సీపీఐ మండల కమిటీ సభ్యులు ఎల్లంకి మధు, ఎస్‌.కె చాంద్‌ పాషా, సీపీఐ(ఎం) మండల నాయకులు బలు లక్ష్మయ్య, గార్లపాటి పవన్‌ కుమార్‌, బోడ అభిమిత్ర, కడియాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love