కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా

If the welfare of the workers is the goal

– బీసీ కార్మిక సేవా సంఘం
యూత్‌ అధ్యక్షుడు దాసరి విజరు
నవతెలంగాణ-శామీర్‌పేట

బీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని బీసీ కార్మిక సేవ సంఘం జిల్లా యూత్‌ అధ్యక్షుడు దాసరి విజరు ముదిరాజ్‌ అన్నారు. సోమవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్‌. రమేశ్‌గౌడ్‌, దాసరి విజరు ముదిరాజ్‌కు శామీర్‌పేటలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీల హక్కుల సాధనకు అహర్నిశలు పాటుడాలని సూచించారు. బీసీల కులవత్తుల అభివద్ధి కోసం కషి చేయాలని తెలిపారు. అనంతరం దాసరి విజరు ముదిరాజ్‌ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. బీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేమురి శివగౌడ్‌, దాసరి మహేష్‌, దాసరి భూపాల్‌, రుద్రబోయిన అశోక్‌, యాదగిరి, నిరుగొండ బాలరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love