– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి మందుల విప్లవ్ కుమార్
నవతెలంగాణ -వలిగొండ రూరల్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆ పార్టీ కార్యకర్తలకే కేటాయిస్తే ఎమ్మెల్యేలు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని డీివైఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి మందుల విప్లవ్ కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం గోకారం గ్రామంలో నిర్వహించిన సీపీఐ(ఎం) జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళలో మళ్లీ గెలవాలని బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాల అమల్లో తీవ్ర పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదన్నారు. ఆ పార్టీ కార్యకర్తలకే దళిత బంధు,గహలక్ష్మి పథకాలను అందిస్తున్నారన్నారు. ఈ మధ్య కాలంలోబీ ఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఈ పథకాలను అమలు చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బహిరంగంగా చెప్పడం సరైంది కాదన్నారు. ఈ విధంగా చేస్తే వచ్చే ఎన్నికలలో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు. సంక్షేమ పథకాలు అమలు అనేది అర్హులను బట్టి చేయాలి కానీ పార్టీలను బట్టి కాదన్నారు. ఈ విధంగా చేస్తే అర్హులు కాకుండా అనర్హులు సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, నాయకులు తుర్కపల్లి సురేందర్,పబ్బు నారాయణ, శాఖ కార్యదర్శి కవిడే సురేష్,దేశపాక బాబు, సిరిపంగి శ్రీరాములు,నారీ రామస్వామి,చెరక వెంకటేశం,నారి జంగయ్య,తోరపునూరు శంకరయ్య, పబ్బు నరసింహ,యాదయ్య యాదగిరి, తందారపెళ్లి గోపాల్ ఆవనగంటి గణేష్,చెర్కలింగస్వామి, శ్రీను,పబ్బు శ్రీకాంత్,తోరపునరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.