యువత ముందుకు వస్తే రుణాలతో పాటు వసతులు కల్పిస్తాం: భట్టివిక్రమార్క

నవతెలంగాణ-హైదరాబాద్ : పరిశ్రమలు స్థాపించేందుకు యువత ముందుకు వస్తే రుణాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం నాడు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణకే రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మధిర పట్టణ విస్తరణకు కావాల్సిన బైపాస్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్‌కు రూ.44 కోట్లు కేటాయించామన్నారు. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కేంద్రంగా మధిరను నిలుపుతామన్నారు. గ్రామాల్లో ఉన్నవారు పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహమిచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

Spread the love