మద్యం డంపులు ఉన్నాయా ఐతే  టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ కొట్టండి.!

– ఎక్సైజ్ సీఐ సైదులు
నవతెలంగాణ- కొడంగల్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా ప్రాంతాల నుంచి మద్యం, నాటుసారా, గంజాయి అక్రమ రవాణా, నిల్వలు ఉన్నట్లు కచ్చితమైన సమాచారం ఉంటే ఎక్సైజ్ ఆప్ అయినటువంటి వెరిట్ ఆప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని స్కాన్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని  ఎక్సైజ్ శాఖ సీఐ సైదులు  ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు 8004252523 నెంబర్ తో 24 గంటలు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. మద్యం చెప్పిన వ్యక్తుల పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కోడంగల్ ఎక్సైజ్ సీఐ నెంబర్ 8712 658751 కు ఫోన్ చేసి తెలపాలన్నారు.
Spread the love