ఇవి తీసుకుంటే…

వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవ్వడంతో నిన్న మొన్నటి వరకు వేసవి తాపం ప్రభావం చూపించింది. ప్రస్తుతం వాతావరణం కాస్త చల్లగానే ఉంది. అయితే వేడి నుండి చల్లదనానికి వాతావరణం మారడంతో శరీరంలోనూ కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్‌లు శరీరంపై ప్రభావం చూపిస్తాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చూద్దాం.
పసుపు పాలు చక్కని ఔషధం. ఇది యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌గా పని చేస్తుంది. పసుపు పాలను తీసుకుంటే జలుబు వంటి సమస్యలు దరిచేరవు.
ఉసిరికాయ కొందరు నేరుగా తింటే మరికొందరు జ్యూస్‌ చేసుకొని తాగుతారు. ఉసిరిని ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచిదే. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల శీతాకాలంలో ఉసిరి ఎంతో మేలు చేస్తుంది.
నెయ్యి తక్షణ శక్తిని అందిస్తుంది. క్రమం తప్పకుండా ఆహారంలో నెయ్యి తీసుకుంటే ఎంతో మంచిది. అయితే కొందరికి ఇందులో మినహాయింపు ఉంటుంది.
బెల్లంలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెల్లం తినడం వల్ల దగ్గు, జలుబు సమస్యలు దరిచేరవు.
చల్లని వాతావరణంలో నువ్వులు తింటే శరీరానికి లోపలి నుంచి వేడి అందుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Spread the love