
మండలంలోని గ్రామాలలో నీటి సమస్య ఉంటే గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలియజేయాలని ప్రజలకు ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి, కంచర్ల, కాచాపూర్, అంతంపల్లి, బస్వాపూర్, గుర్జకుంట, తిప్పాపూర్, రామేశ్వర్ పల్లి గ్రామాలలో నీటి సమస్యల వివరాలు పంచాయతీ కార్యదర్శుల చేత అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కార్యదర్శులకు సూచించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మంచినీటి పైప్ లైన్ లీకేజీకి మరమ్మత్తులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.