మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరిస్తాం : అక్బరుద్దీన్ ఒవైసీ

నవతెలంగాణ హైదరాబాద్‌: పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం అసెంబ్లీ(Assembly)లో గవర్నర్‌ ప్రసంగాని(Governor Speech)కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ… ‘‘మైనార్టీల అభివృద్ధికి కృషి చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి మద్దతు ఇచ్చాం. రాజకీయాలు ఎన్నికల వరకే.. గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పని చేయాలి. పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని కోరుతున్నాం. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావనే లేదు. అలాగే కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలి’’ అని అక్బరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు.

Spread the love