వడదెబ్బ తగిలితే…

వడదెబ్బ తగిలితే...ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో బయటకు వెళ్ళాల్సి వస్తే గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తీసుకెళ్లాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము.
ఉల్లిగడ్డను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి.
జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్‌ పొడిని ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి.
ఎండలో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.
మజ్జిగ తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
కీరదోస ముక్కల్ని రెండుపూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను దరిచేరనీయవు.
శరీరంలో నీటిశాతం తగ్గకుండా వుండేందుకు పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.
సలాడ్స్‌, తాజా కాయగూరలు, ప్రూట్‌ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Spread the love