ఉద్యోగం కోసం వేరే ఊరు వెళితే ఓటు తీసయడం సరికాదు: నిమ్మగడ్డ

నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికల సంఘం మాజీ కమిషనర్, సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పర్యటించారు. ఓట్ల జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎలుగెత్తారు. ఫారం-7 బాధితులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మన ఓటు మన హక్కు అంటూ ఫారం-7 బాధితులతో కలిసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఓటు హక్కుకు విఘాతం కలిగించేలా ఫారం-7 దరఖాస్తులు వస్తున్నాయని వెల్లడించారు. సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరికీ ఉంటుందని, ఉద్యోగం కోసం వేరే ఊరు వెళితే ఓటు తీసేయడం సరికాదని అన్నారు. గంపగుత్తగా ఫారం-7 దరఖాస్తులు అప్ లోడ్ చేసేవారిపై నియంత్రణ ఉండాలని నిమ్మగడ్డ సూచించారు. దుగ్గిరాలలో 23 మంది స్థానికుల ఓట్లకు ఫారం-7 పెట్టారని ఆరోపించారు. ఫారం-7 దరఖాస్తులపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశానని తెలిపారు.

Spread the love