ప్రత్యేక పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..

– డిపిఓ తరుణ్ కుమార్
నవతెలంగాణ కొడంగల్ : పారిశుద్ధ్యం పై ప్రత్యేక చొరవ చూపాలని డిపిఓ తరుణ్ కుమార్ అన్నారు, కొడంగల్ మండలం పెద్ద నందిగామ, హుస్సేన్ పూర్ గ్రామాలలో శనివారం ఎంపీ ఓ శ్రీనివాస్ తో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య పనులలో భాగంగా నర్సరీ, కాంపోస్ట్ షెడ్డు, గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామలలో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల పై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు, పారిశుధ్యం పై దృష్టిసరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు, హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు, తడి, పొడి చెత్తను వేరు వేరు చేయాలని సూచించారు, ప్రత్యేక పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహించిన చర్యలు తీసుకుంటామన్నారు, పంచాయతీ రికార్డులను తనిఖీ చేసి రికార్డులు పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు, ప్రత్యేక పారిశుధ్యం పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని పెద్ద నందిగామ గ్రామంలోని షాపులకు తెలియజేశారు, పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహిస్తున్నారని పెద్ద నందిగామ, హుస్సేన్ పూర్ పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు, పెద్ద నందిగామ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు, ఈ కార్యక్రమంలో పెద్ద నందిగామ సర్పంచ్ శారదమ్మ, హుస్సేన్ పూర్ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు కొండయ్య, మల్లప్పలు పాల్గొన్నారు.
Spread the love