నవతెలంగాణ-హైదరాబాద్ : దళిత బంధు ఇవ్వాలని అడిగితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేస్తారా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ప్రశ్నిస్తే దాడి చేయడమా అని మండిపడ్డారు. పాలకుల వద్ద మెప్పు పొందేందుకు పోలీసులు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో చెల్లిస్తామని హెచ్చరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ కక్ష పెంచుకున్నారని విమర్శించారు.