ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాపుల్లో నకిలీ విత్తనాలు మందులు అమ్మితే చట్టపరమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని విత్తనాలు ఎరువుల షాపులను ఏవో వసంత తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభం కానున్నందున నకిలీ విత్తనాలు మందులు ఎరువులు మార్కెట్లో అమ్మితే పట్టుబడ్డ దుకాణాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నకిలీ మందులు విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు మందులు వారికి అంటగడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారన్నారు. నకిలీ విత్తనాలతో పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సంవత్సరమంతా కష్టపడ్డ దిగుబడులు రాక అప్పుల పాలు అవుతున్నారని అందుకే సీజన్ ప్రారంభానికి ముందే దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు పురుగు మందులు అమ్మినట్లు తెలిస్తే వెంటనే 8712670038 పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు