అర్థం చేసుకుంటే నాన్నే నేస్తం

– ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, స్వరూపా రాణి
నవతెలంగాణ – హైదరాబాద్
నాన్నని అర్థం చేసుకొంటే అంత మంచి స్నేహితుడు ఎవరూ ఉండరని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్,డా.పి స్వరూపా రాణి , శోభా రాణి, అన్నారు. జూన్16 ఫాదర్స్ డే సందర్భంగా రామకృష్ణ మఠంలో యోగా నంద రఘుమహారాజు, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలల సేవా విభాగంలో నాన్న పై డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి సోమవారం బహుమతులను, కంపాస్ బాక్సులు, దేశభక్తి గీతాలు, పెన్నులు,నోట్ పుస్తకాలు, ఆరతి,డా.పి స్వరూపా రాణి, శోభా రాణి,బి.సరోజని రామారావు,జి.కృష్ణ వేణి, డా.హిప్నో పద్మా కమలాకర్ అందజేశారు. వారు మాట్లాడుతూ.. న్నాన్న కోపం ఉరుమని, ప్రేమ వర్షం లాంటిదని తెలిపారు. నాన్న అంటే కొండంత అండని,ఒక భరోసా, భద్రత అన్నారు . నాన్న అంటేనే ధైర్యమన్నారు. సూర్యుడిని చూస్తేనే శక్తి కనిపిస్తుంది.. తండ్రిని చూసిన అలానే అనిపిస్తోందన్నారు. అమ్మాయిలు తండ్రికెప్పుడూ యువరాణులే! కొడుకులు యువరాజు లేనని చెప్పారు. నాన్న మాటను అర్థం చేసుకుంటే సరైన దారిలో నడవగలరన్నారు. మనలోని లోపాలను సరిచేస్తూ, భవిష్యత్తుకు పునాదులు వేస్తూ.. మనకు గమ్యం చూపేది.. ‘నాన్నే నన్నారు. సమస్యలు వచ్చినప్పుడు తండ్రి ఇచ్చె ధైర్యం మరేవరూ ఇవ్వలేరన్నారు.
దేశ రక్షణ కోసం సైనికులు పని చేస్తే, కుటుంబ రక్షణ కోసం నాన్న అహర్నిశలు పని చేస్తాడన్నారు. ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ అయితే, ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేవాడు నాన్న’ అని అన్నారు. జీవన విధానాన్ని, నడక, నడవడిక, నాగరికత, సమాజంలో మనగలిగే ఒడుపు, లౌకిక వ్యవహారాలు, మనుగడకు మెలకువలు లాంటివెన్నో నేర్పించేది నాన్నే నన్నారు. తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకు నడిపించడమంటే దారి చూపడం కాదని, భవిష్యత్తులోకి దారితీయడమని తెలిపారు. తనకు కలిగే కష్టాలు, తగిలే గాయాలు బహిర్గతం చేయని మగ మహారాజన్నారు. కాఠిన్యాలూ, కన్నెర్రజేయడాలూ ప్రేమలేక కాదు, దాన్ని వ్యక్తం చేయలేకా కాదు. ఎదుగుదల ఆగక, విజయపథంలో దూసుకు పోవాలన్న ఆరాటమే ఆయన్ని మౌనంగా ఉంచేస్తుందని చెప్పారు. పిల్లలు గెలిచినప్పుడు మనసులోనే అభినందిస్తాడన్నారు. పిల్లలు ఓడిపోతే భుజం తట్టి ధైర్యం చెబుతాడన్నారు. అదే నాన్న నైజం, ఔన్నత్యం అని తెలిపారు. తప్పటడుగుల వయసులో చేయూతనందించి, తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్దే దినాన్నే నన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న ప్రేమిస్తాడు, వ్యక్తం చేయడు. ఆదరిస్తాడు, ఆర్భాటం చేయడు. పిల్లల సాధించిన విజయం, సంతోషం తనదే అనుకుంటాడు నాన్నా.. అని అన్నారు. ఆయన గురించి అంతా తెలుసు అనుకుంటారు చాలామంది పిల్లలు. కానీ ప్రతి నాన్న మనకు తెలియని ఓ గొప్ప పుస్తకమని దానిని చదవడానికి ప్రయత్నించాలన్నారు. ఇందిరా పార్క్ లో యోగా గురు బి. సరోజని రామారావు ఆధ్వర్యంలో నాన్నలను ఘనంగా సత్కరించారు.

Spread the love