గతం కంటే సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా వాడకాన్ని కంట్రోల్ చేసుకుందామనుకున్నా, ఆచరణలో సాధ్యం కాదు. నిజంగా కంట్రోల్ చేసుకోవాలని భావించే వారికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.. అవేంటో చూద్దాం…
సోషల్ మీడియా యాప్స్‌ని డిలీట్ చేసే యండి. ముందు పన్నెండు గంటల పాటూ మీ ఫోన్‌లో సోషల్ మీడియాని ఆఫ్ చేసి ప్రయోగం చేసి చూడండి.
సోషల్ మీడియాకి దూరంగా ఉందామన్న ఒక ఫ్రెండ్‌తో కలిపి ఈ డీటాక్స్ ప్రోగ్రాంని మొదలు పెట్టండి. అప్పుడు ఇద్దరూ కలిసి కొన్ని గోల్స్ పెట్టుకుని వాటిని రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా మరొకరితో కలిసి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏ పనైనా చేయడం తేలిక అవుతుంది.
మీరు ఏ సోషల్ మీడియా యాప్స్‌ని ఎక్కువ చూస్తున్నారో ఒక అంచనాకి రండి. ఎంత సమయం వెచ్చిస్తున్నారో లెక్క వేసుకుని, ఆ సమయంలో ఇంకే దైనా క్రియేటివిటీగా చేయవచ్చేమో ఆలోచించండి.
ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. మీ గురించి మీ దగ్గర వారికీ, మిమ్మల్ని ప్రేమించే వారికీ ఎక్కువ తెలుస్తుంది. ఫోన్‌తో మీ రిలేషన్‌షిప్ గురించి వారు ఏమనుకుంటున్నారో ఒకసారి అడగండి. వారితో మీరుండే సమయంలో మీ ఫోన్ వాడకం ఏ విధంగా ఉందో చెప్పగలుగుతారు. దాన్ని బట్టి మీరెలా ఉంటున్నారో తెలుస్తుంది.
ఫోన్‌కి కూడా నిద్ర కావాలి. రాత్రి తొమ్మిది, పది తర్వాత ఫోన్ పక్కన పెట్టండి. చేతికి అందుబాటులో వద్దు. చేతికి అందుబాటులో ఉంటే నిద్ర లేవగానే లేదా నడిరాత్రిలో మెలకువ వచ్చినపుడో ఫోన్‌నే పట్టుకుంటాం. అలా వద్దు. కాస్త దూరంగా పెడితే, మళ్ళీ మర్నాడు పొద్దున్నే ఫోన్ పట్టుకునేది.
ఫోన్‌లో అలారం పెట్టుకోవడం మానే యండి. అందుకు క్లాక్ ఉపయోగించండి. ఫోన్‌లోనే అలారం ఉంటే లేస్తూలేస్తూనే, దాని వాడకంలో పడిపోతాం.
హోం స్క్రీన్ మీద సోషల్ మీడియా యాప్స్ ఉండటం కంటే, ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటే యాక్సెస్ కొంత తగ్గుతుంది.
ప్రశాంతంగా ఉండటం వల్ల ఒత్తిడి తగ్గడం, నిద్ర పట్టడం వంటి వాటితో పాటూ మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది. దానితో పాటు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే అవగాహన కూడా ఉంటుంది. ఈ అవగాహన సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.