ఓడిన ప్రజల కోసం పనిచేస్తా

– కార్యకర్తలందరూ దైర్యంగా ఉండాలి
– మణికొండ చెర్మన్‌ కస్తూరి నరేందర్‌
నవతెలంగాణ-గండిపేట్‌
ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని రాబోయే రోజుల్లో ముందుకె ళ్తామని మణికొండ ఛైర్మెన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కస్తూరి నరేందర్‌ అన్నారు. సోమవారం గండిపేట్‌ మండలం మణికొండ మున్పిపాలిటీలో ముఖ్య కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని దైర్ఘ్యంగా ముం దుకెళ్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో ప్రజా సమస్యలను పరిష్కరిం చుకునేందుకు కృషి చేస్తామన్నారు. తన కోసం పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జితేందర్‌రెడ్డి, పూలపల్లి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దపులి కిషన్‌ (కృష్ణ) మాజీ సర్పంచులు హరికృష్ణ, గండ య్య, అంజనేయులు, కాం గ్రెస్‌ కౌన్సిలర్లు, నాయకులు పాపిరెడ్డి, మైలారం శ్రీనివాస్‌, పద్మారావ్‌, నరేందర్‌, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love