నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్), వీవోఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్ధన్ డిమాండ్ చేశారు. సమ్మెలు, దీక్షల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడాన్ని శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం రూ.27 వేలు నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ఆన్‌లైన్ సేవలను నిలిపేయాలని సూచించారు. సీసీలుగా ప్రమోట్ చేయాలని తెలిపారు. వారికి గుర్తింపు కార్డులు, బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్‌ఐ కల్పించాలని పేర్కొన్నారు. జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పనిభారం తగ్గించాలని తెలిపారు. మహిళా కార్యదర్శులకు ఆర్నెళ్లపాటు మెటర్నిటీ సెలవులు పొడిగించాలని పేర్కొన్నారు. ప్రొవిజినల్ పీరియడ్‌లో చేసిన పనిని సర్వీస్‌గా పరిగణించాలని కోరారు.