విద్యుత్‌ బకాయిల గురించి ఒత్తిడి చేయొద్దు : కేంద్రానికి హైకోర్టు ఆదేశం

నవతెలంగాణ – హైదరాబాద్‌
ఏపీ విద్యుత్‌ సరఫరా చేసిన నిమిత్తం రూ.6,757 కోట్లు విద్యుత్‌ బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఏ విధమైన ఒత్తిడి తీసుకురావొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ వేసిన మధ్యంతర పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేసింది. విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. తెలంగాణ ప్రభుత్వం రూ.6,757 కోట్లు చెల్లింపు వ్యవహారంపై గతంలోనే హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోతే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశముంటుందని తెలంగాణ ప్రభు త్వం ఆందోళన వ్యక్తం చేయడంతో పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. తీర్పున కు లోబడి ఎంబీబీఎస్‌ సీటు కేటాయింపు ఒకటి నుంచి పదో తరగతి వర కు తెలంగాణలో చదివిన విద్యార్థిని స్థానికేతరులు గా పరిగణించడంపై విచారణ చేస్తామంటూ హైకోర్టు తెలిపింది. తల్లి దండ్రులు ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్లిన కారణం గా అక్కడ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థిని హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ప్రశంస రాథోడ్‌కి నీట్‌లో ర్యాంక్‌ వచ్చింది. అయితే ఆమె నాన్‌లోకల్‌ అంటూ అధికారులు ప్రక టించారు. దీంతో ఇందు కు సంబంధించిన జీవో 114ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ మంగళవారం వి చారించింది. పిటిషనర్‌కు ఎంబీబీఎస్‌ సీటు కేటాయి ంచాలనీ, అయితే తుది తీర్పునకు లోబడి అది ఉంటుందని ఉత్తర్వులను జారీ చేసింది.

Spread the love