ఐకియా హోమ్ ఫర్నిషింగ్ పరిష్కారాలు.. డ్రైవ్ ఆన్ వీల్స్

నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాదులో అనేక మందికి సన్నిహితంగా తీసుకురావడానికి గాను, ఐకియా (IKEA) తమ కస్టమర్లకు స్థోమతకు తగిన, స్థిరమైన, పనిచేసే మరియు చక్కగా-డిజైన్ చేయబడిన హోమ్ ఫర్నిషింగ్ పరిష్కారాలను ప్రదర్శించి చూపడానికై వారిని కలుసుకునే ఒక వినూత్నమైన మార్గాన్ని పరిచయం చేస్తోంది. ఒక ట్రక్కు లోపల ఏర్పాటు చేయబడిన బెడ్ రూమ్ అమరికతో కస్టమర్లకు దగ్గరగా రావడానికి ఐకియా, ఐకియా ఆన్ వీల్స్‌ని సెటప్ చేసింది. మా కస్టమర్లు ఇంట్లో మెరుగైన దైనందిన జీవితం కోసం ఐకియా యొక్క బెడ్‌రూమ్ శ్రేణిని మరియు స్టోరేజ్ పరిష్కారాలను ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందడానికి గాను ఈ అమరికను హైదరాబాదులోని వివిధ ప్రదేశాలలో ఉంచడం జరుగుతుంది. ప్రజలు ఈ ప్రదర్శనకు విచ్చేసి అమరికను అన్వేషించి ఆనందించవచ్చు మరియు అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. ఐకియా ఆన్ వీల్స్ బెడ్ రూమ్ అమరిక 2023 జూలై వరకూ లైవ్ లో ఉంటుంది.  ప్రజలు దీనికి విచ్చేసి అమరికను అన్వేషించి ఆనందించవచ్చు మరియు జూన్ 23 నుండి 25 వరకు రాజ్‌పుష్ప రెగాలియా, జూన్ 26 న ఎం.ఎన్ పార్క్, జూన్ 27 మరియు 28 న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్, జూన్ 29 మరియు 30 వ తేదీల్లో హిల్ రిడ్జ్ స్ప్రింగ్ వద్ద సందర్శించి అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు.

Spread the love