మహిళా రెజ్లర్ల అక్రమ అరెస్టులు ఖండించాలి

మాలభేర రాష్ట్ర న్వీనర్‌ పీక కిరణ్‌
నవతెలంగాణ -మహాముత్తారం
మహిళా రెజ్లర్ల అక్రమ అరెస్టులను ఖండించలని పీక కిరణ్‌ అన్నారు. సోమవారం మహా ముత్తారం మండల కేంద్రం లో పత్రిక విలేకరుల సమావేశంలో మాలభేరి రాష్ట్ర కన్వీనర్‌ పీక కిరణ్‌ మాట్లాడారు.. మహిళా రెజ్లర్లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆల్‌ ఇండియా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నెల రోజు లకు పైగా ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద నిరవధిక ఆందోళన సాగిస్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయకుండా కాపా డుతున్న కేంద్రప్రభుత్వం నిరంకుశ చర్యలను నిరసిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌ వంటి ఎంతోమంది క్రీడాకారులు ముందు వరుసలో నిలబడి మహిళా క్రీడాకారులుగా, అథ్లెట్లుగా తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల్ని, అవమానాల్ని దారుణ పరిస్థితుల్ని బహి రంగంగా వివరిస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికల్లో పత కాలు సాధించినప్పుడు అదంతా తమ ఘన కీర్తిగా, దేశ ప్రతి ష్టగా చాటుకుంటున్న క్రీడా సమాఖ్యలు, రాజకీయ నాయ కులు, ప్రభుత్వాలు మహిళా క్రీడాకారులు తాము ఎదుర్కొం టున్న సమస్యల గురించి చెప్పినప్పుడు దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బాధితులని నోరెత్తకుండా చేస్తూ నిందితుల్ని కాపాడడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అవమానిస్తూ, వేధిస్తూ, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు.తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ నూతన పార్లమెంటు భవనం వద్దకు వెళుతున్న మహిళా రెజ్లర్లను, మద్దతుగా వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికికక్కడ అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్రమ అరెస్టులు సాగించారు. బ్రిజ్‌ భూషణ్‌ పై ఎలాంటి చర్యా తీసుకోకుండా కాపాడుతున్న పాలకులు మహిళా రెజ్లర్ల పట్ల అనుసరిస్తున్న ఈ దారుణ వైఖరిని ఖండించాలన్నారు.

Spread the love