– ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే (బిఎస్‌ఎస్‌ఎం) చైర్మన్ మంద్దిశెట్టి సామ్యులపై అక్రమ కేసులు పెట్టారని ములకలపల్లి ప్రాంత వాసులు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కార్యాలయం ముందు గ్రామస్తులు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం పలువురు నాయకులు ఎస్పీ వినీత్‌ని కలిసి మాట్లాడారు. చర్చల అనంతరం భారత సర్వ సమాజ్ మహాసంగ్రామ్ ఆఫ్‌్ ఇండియా (బిఎస్‌ఎస్‌ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు సతీష్ మాదిగ మీడియాతో మాట్లాడారు. బిఎస్‌ఎస్‌ఎం సంస్థ తెలంగాణ చైర్మన్ మద్దిశెట్టి శామ్యూల్‌పై ఉద్దేశపూర్వకంగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోడు రైతులకు పట్టాలు ఇప్పిస్తానని మూడేండ్ల క్రితం రూ.9 లక్షల 80లు అక్రమంగా వసూళ్లు చేశాడని ముల్కలపల్లి మండలం, మావిళ్లగూడెంకు చెందిన మడివి చుక్కయ్య ఇచ్చిన ఫిర్యాదుపై సామ్యేల్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే సామ్యూల్ హైకోర్టును ఆశ్రయించాడని, ఈ సమయంలో పోలీస్ వారు కేసులు పెట్టడం సరైనది కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా చూడాలని కోరినట్టు వారు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత సర్వ సమాజ్ మహా సంఫ్‌ు ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ పీటర్, వరంగల్ జిల్లా ఇన్‌చార్జీ ఐలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు గుగులోతు లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.