– తెలంగాణ ఆధివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. గొంది రాజేష్, దుగ్గి చిరంజీవి.
నవతెలంగాణ -తాడ్వాయి
పేదల ఇంటి స్థలాల్లో అక్రమ నిర్మాణాన్ని ఆపాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కద్ది రాజేష్ ది చిరంజీవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఊరట్ఠం గ్రామములో కొత్తగా నిర్మించాలనుకుంటున్న గ్రామ పంచాయతి నిర్మాణానికి సంబంధించి విషయములో స్థల సేకరణ చేయకుండా అమాయక ఆదివాసుల, పేదల ఇంటి స్ధలాలను అక్రమంగా ఆక్రమించి అట్టి స్థలములో నిర్మాణం చేయాలనుకోవడం అవీవేకమని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గొంది రాజేష్ అన్నారు. గత 50 ఏళ్లుగా నివాసముండి ఈ మధ్య కాలంలో ఊరట్ఠం కాలనిలో బాధితులు ఇల్లు నిర్మించుకున్నారన్న నెపంతో వారి స్థలాన్ని ఆక్రమించడం మరియు అక్కడ గ్రామ పంచాయతీ నిర్మాణం చేయాలనుకోవడం ఒక దుశ్చర్య అని అన్నారు. ప్రభుత్వం, అదికారులు స్పందించి వెంటనే సర్వే చేసి అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని ఆపి పేదలకు, ఆదివాసులకి న్యాయం చేయలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమములో అధివాసి గిరిజన సంఘం రాష్ట్రా కమ్మిటి సభ్యులు . దుగ్గి చిరంజీవి వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కృష్ణ మరియు బాధితులు పోలేబొయిన మల్లక్క, చందా సత్యమ్మ, గంప నీలమ్మ, గుండ్ల బుచ్చక్క, గంప మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.