అక్రమ కట్టడాలు అరికట్టాలి..

నవతెలంగాణ – ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని సబ్దల్ పుర్ గ్రామస్తులు అక్రమ కట్టడాలు అరికట్టాలని బుధవారం పలు అధికారుల కు వినతిపత్రాన్ని అందాచేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ సబ్దల్పూర్ గ్రామ శివారులో గత శతాబ్ద కాలం నుండి హనుమాన్ ఆలయం కలదు. ఇట్టి ఆలయంలో నిత్య పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరగడం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. కానీ ఇట్టి ఆలయ ఆవరణంలో వేరే మతానికి చెందిన కొందరు మత గౌరవాన్ని దెబ్బతీస్తూ మా యొక్క హిందూ భక్తులను ఆకర్షించి అన్యమత ప్రచారం చేయడానికి రెచ్చగొట్టే విధంగా హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కొంత భూమిని పొలం చేసుకోవడానికి అని చెప్పి, కొని అక్కడ అక్రమ నిర్మాణనికి స్వీకారం చేస్తున్నారు. ఇక్కడ అక్రమ నిర్మాణానికి కొందరు కావాలని ఆసక్తి చూపిస్తూ, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కావున వెంటనే అక్రమ నిర్మణన్నీ అనుమతులు ఇవ్వవద్దు, అక్రమ నిర్మాణం ఆపాలని కోరుతూ డీఎస్పీ, ఎస్ ఐ, అలాగే తహశీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ, అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇలాంటి అక్రమ కట్టడాలు జరిగితే ఊరుకునేది లేదు మేము ఇంకా శాంతి యుతంగా ఉన్నాం మాకు మా సహనాన్ని పరీక్షించకండి పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది.

Spread the love