– మండల ఎమ్మార్వో ఆఫీసుకు కూత వేటు దూరంలో లోడింగ్ అన్ లోడింగ్
– పట్టించుకోని అధికారులు, ఓవర్ లోడు బీటీ రోడ్డుపై మట్టి పెళ్ళాలు
– పట్టించుకోని అధికారులు, ఓవర్ లోడు బీటీ రోడ్డుపై మట్టి పెళ్ళాలు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలోని పోల్కం చెరువు నుండి జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో పట్టపగలు రోడ్డుపక్కల ఉన్న కమర్షియల్ పనులకు మట్టిని తరలిస్తూ లెవలింగ్ పనులు కొనసాగిస్తూ శనివారం ఎత్తేచగా మట్టిని సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్ అధికారుల నుంచి రెవెన్యూ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. మండల కేంద్రంలో ఇలా మట్టి అక్రమ రవాణా కొనసాగిస్తున్న అధికారుల కండ్ల ముందటే కనిపిస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువు కట్టలు చెరువులోని మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవలసిన ప్రభుత్వం అధికారులు మౌనం పాటిస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకొని అక్రమ మట్టిని దర్జాగా తరలిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా సంబంధిత శాఖ అధికారులు వీరికి సహకరిస్తున్నారు. మండల కేంద్రంలో ఇలా ఉంటే మారుమూల ప్రాంత గ్రామాలలో ప్రభుత్వ చెరువులను, గుట్టలను కాపాడేది ఎవరని పలువురు చర్చించుకుంటున్నారు. ఎంపీడీవో ని అడగండి ఉపాధి హామీ పనులు ఉండవచ్చు, చెరువులో కూడిక తీస్తే ఇరిగేషన్ అధికారిని అడగండి, మేము ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు. వ్యవసాయ రైతులు పంట పొలాలకు వాడుకుంటే ట్రాక్టర్లు పెట్టి వాడుకుంటారు-ఉప్పునుంతల మండల ఎమ్మార్వో, శ్రీకాంత్ చెరువుల మట్టి మాకు ఎలాంటి సంబంధం ఉండదు రెవెన్యూ, ఇరిగేషన్ కి అనుమతులు ఇవ్వాలంటే వారికే ఉంటుంది. మేము ఉపాధి హామీ పనులు చేపట్టినట్లయితే జెసిబి యంత్రంతో పనులు చెయ్యం ఉపాధి కూలీలతో పనులు కొనసాగిస్తాం. చెరువు దగ్గరలో ఇప్పుడైతే ఎలాంటి పనులు జరగట్లేదు మా నుంచి ఎలాంటి అనుమతులు ఉండవు-బాలచంద్ర సుజాన్,ఫుల్ అడిషనల్ ఇన్చార్జి ఎంపీడీవో, ఉప్పునుంతల వండ్రు మట్టిని వ్యవసాయ పొలాలకు వాడుకోవచ్చు కమర్షియల్ గా ఇండ్లకు, గ్రామంలో ఇండ్ల మధ్యన లేవలింగ్ కొరకు సొంత పనులకు వాడుకోవద్దు మా నుంచి చెరువులోని మట్టి తరలించడానికి ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వలేదు. కమర్షియల్ గా వాడకానికి మట్టి తరలించినట్లు నిర్ధారణ రుజువైతే రెవెన్యూ, పోలీసుల సహకారంతో జేసీబీ, ట్రాక్టర్లు తరలిస్తున్న వాహనాలపై కేసులు చేపిస్తాం-ఇరిగేషన్ ఏఈ, సందీప్.