యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా..

Illegal transport of sand– ఒక ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్న రెవిన్యూ సిబ్బంది..

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో ప్రస్తుతం ఇసుక రీచ్ లకు అనుమతి లేకపోయినా ఇటీవల వరదల తో గండి పడ్డ పెద్దవాగు ప్రాజెక్ట్ ముంపు వ్యవసాయ క్షేత్రాలు,వాగులు నుండి కొందరు ఇసుక వ్యాపారులు సుమారు 8 నుండి 10 ట్రాక్టర్ తో యదేచ్చగా ఇసుకను తరలిస్తున్నారు. ఎవరైనా నిలిపి అడిగితే తహశీల్దార్ అనుమతితో తరలిస్తున్నాం అని బుకాయిస్తున్నారు. ఇదే విషయం పలువురు విలేకర్లు సోమవారం వివరణ కోరగా మేము ఎవరికి అనుమతి ఇవ్వలేదని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. ఒక ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ఆ ఇసుక నిర్మాణాలకు పనికిరాదని జిల్లా మైనింగ్ అధికారులు నిర్ధారణ సైతం చేసి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు నివేదిక సైతం అందజేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో యువ నాయకులుగా చెలామణి అవుతున్న ఒకరిద్దరు ఈ అక్రమ రవాణా కు వెన్నుదన్నుగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Spread the love