రాజేంద్రనగర్‌లో యథేచ్ఛగా గంజాయి స్మగ్లింగ్

నవతెలంగాణ – రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో గంజాయి స్మగ్లింగ్ యథేచ్చగా జరుగుతోంది . గంజాయి స్మగ్లింగ్ గుట్టును రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం రట్టు చేసింది. 6 కేజీల గంజాయిని సీజ్ చేసింది. ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. చిన్న చిన్న ప్యాకెట్స్‌లో గంజాయిని ప్యాక్ చేసి విక్రయిస్తోంది. గంజాయి విక్రయిస్తుండగా ఎస్ఓ‌టీ టీం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love