మంజీరా టు మహారాష్ట్ర సరిహద్దులు దాటుతున్న అక్రమ ఇసుక రవాణా

– జీరో దందాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
– పట్టించుకోని ప్రభుత్వ శాఖల అధికారులు
నవతెలంగాణ-మద్నూర్
మంజీరా నది నుండి మహారాష్ట్రకు సరిహద్దులు దాటిస్తూ అక్రమంగా ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది మన రాష్ట్ర అంతర్రాష్ట్ర చెక్పోస్టు రహదారి గుండ కాకుండా అడ్డుదారులైన మద్నూర్ మండల కేంద్రం నుండి పెద్ద తడగూర్ రోడ్డు గుండా సరిహద్దు దాటి భారీ లారీ లలో మహారాష్ట్రకు అక్రమ ఇసుక తరలిస్తున్నారు ప్రభుత్వ వే బిల్లులు లేకుండా అక్రమంగా జీరో దందాలతో సరిహద్దులు దాటి ఇసుక రవాణా పట్ల సంబంధిత శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ అక్రమ ఇసుక దందాను అదుపు చేయడం లేక తెలంగాణ రాష్ట్ర ఇసుక మహారాష్ట్రకు అక్రమంగా తరలి వెళ్తుంది ఇక్కడ ప్రజలకు ఇసుక లభించాలంటే నాలుగు వేల రూపాయలకు ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది ప్రభుత్వ అనుమతులు ఇసుక రవాణా మహారాష్ట్రకు తరలించడం ఇదెక్కడి న్యాయమంటూ ప్రజలు ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారు అక్రమంగా తరలివెళ్లి ఇసుక రవాణాకు అధికార పార్టీ అండ కొనసాగుతుందని ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమ ఇసుక రవాణా సరిహద్దులు దాటి మహారాష్ట్రకు తల్లి వెళ్లకుండా అదుపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Spread the love