కాటారం మండలంలోని విలసాగర్ గ్రామంలో ఉన్న ఇటుక బట్టీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వచేసిన సింగరేణి బొగ్గును పట్టుకుని సీజ్ చేసినట్లుగా భూపాలపల్లి ఏరియా సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ ఇన్స్పెక్టర్ లింగయ్య, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ గార్డ్ దేవేందర్ తెలిపారు.సోమవారం ఇటుక బట్టీలపై తనిఖీ చేయగా ఇటుక బట్టి యజమాని దగ్గర ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఇటుక బట్టి యజమాని, సూపర్వైజర్ పై కాటారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ సంఘటనపై సింగరేణి మరియు పోలీస్ అధికారులు విచారణ చేపట్టినట్లుగా తెలిపారు.