నీలా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన ఇల్తెపు శంకర్

నవతెలంగాణ-రెంజల్ : రెంజల్ మండలం నీలా జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఈ. శంకర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు గ్రామ కమిటీ సభ్యులు శాలువా కప్పి పూలమాలలతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శంకర్ ప్రధానోపాధ్యాయులుగా ఉపాధ్యాయులు చేపట్టడం తమ విద్యార్థుల అదృష్టమని వారు స్పష్టం చేశారు. అలాగే మండలంలోని దూపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా గణేశ్ రావు, రెంజల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఆంజనేయులు, తాడి బిలోలి పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలుగా రేఖ, కూనెపల్లి పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలుగా అనురాధ బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, సాయి రెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు రాఘవేందర్, రాఘవాచారి, ఉపాధ్యాయులు ఎన్ శ్రీనివాస్ తాహెర్, ఆనంద్, అబ్బయ్య, హైమద్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love