– సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, కొత్తగూడెం ప్రాంతంలో పార్టీ విస్తరణకు కృషి చేసిన ప్రముఖుల్లో కాసాని ఐలయ్య మృతి పార్టీకీ తీరని లోటు అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య విచారం వ్యక్తం చేసారు. గుండెపోటు తో శనివారం ఐలయ్య మృతి చెందిన విషయం తెలుసుకుని ఆయన దిగ్బ్రాంతికి గురయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు ఈ తరం పార్టీ నాయకుల్లో ఐలయ్య నిజాయితి కీ నిలువుటద్దం లాంటి వారని అన్నారు. సీపీఐ(ఎం) అశ్వారావుపేట మండలం కమిటీ తరపున ఆయన కాసాని ఐలయ్య కు నివాళి తెలిపి,సంతాపం వెలిబుచ్చారు. నివాళులు అర్పించిన వారిలో జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాదరావు,మడిపల్లి వెంకటేశ్వరరావు లు ఉన్నారు.