తల్లిపాల వలన ప్రయోజనాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సు కల్పించిన ఐఎంఏ

నవతెలంగాణ – కంటేశ్వర్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వుమెన్ డాక్టర్స్ వింగ్ నిజామాబాద్ వారి అధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు తల్లీ పాల దినోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆస్పత్రి నందు తల్లిపాల వలన ప్రయోజనాల గురించి గర్భిణి స్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించి అనంతరం తల్లిపాల వలన ప్రయోజనాల అవగాహన కర పత్రాలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్ డాక్టర్స్ వింగ్ (IMA WOMEN DOCTORS WING) రాష్ట్ర అధ్యక్షురాలు డా. కవిత రెడ్డి & ముఖ్య అతిథి ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ప్రతిమా రాజ్ లు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథి ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ప్రతిమా రాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు డా. కవిత రెడ్డి లు మాట్లాడుతూ..తల్లిపాలు పట్టడం వలన బిడ్డకు ప్రయోజనాలు మామూలు పాలు త్రాగిన పిల్లల కంటే తల్లిపాలు త్రాగిన పిల్లలు చాలా తెలివిగలిగినవారై ఉంటారని, తెలివితేటల్లో చాలా చురుగ్గా వుంటారు. తల్లిపాలు త్రాగిన పిల్లలు చదువులో, • బిడ్డకు అవసరమైన అన్ని రకాల పోషకాలు తల్లిపాలలో సమృద్ధిగా వుంటాయని.  తల్లిపాలు పిల్లలకు తొందరగా జీర్ణం అవుతాయిని అన్నారు. తల్లిపాలు చాలా స్వచ్ఛమైనవని బాక్టీరియా నుండి కాపాడతాయని అందువలన పిల్లలను చాలా రకాల జబ్బుల కాపాడుటాయిని అన్నారు.తల్లులు రక్తహీనత సమస్యలు లేకుండా, ప్రసవం తర్వాత జరిగే రక్తస్రావం నుండి రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ల నుండి రక్షిస్తుందని. తల్లిపాల వలన కుటుంబానికి మరియు సమాజానికి కలిగే ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ (IMA womens wing) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డా. భాండారి సుజాత, డా. ప్రియాంక, రాష్ట్ర సహాయ కార్యదర్శి డా. ఫరీద బేగం , సహాయ కార్యదర్శి డా. సాయి లక్ష్మి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. జలగం తిరుపతి రావ్ , డా. బాలెష్, పూర్నిమా, డా. దీపక్ గర్భిణి స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love