ఈ నెల 17 న గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగనుంది అని సార్వజని గణేష్ మండలి నిర్వాహకులు బంటు గణేష్ మంగళవారం తెలిపారు. నిజామాబాద్ నగరం లోని దుబ్బా ప్రాంతం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు శోభాయాత్ర మొదలవుతున్నదని సార్వజనిక గణేష్ మండలి నిర్వాహకులు బంటు గణేష్ తెలియజేశారు. శనివారం కొలువుదీరిన గణనాధుల నిమజ్జనం ఫై ఈసారి కూడా గందోరగోళం నెలకొంది అని అన్నారు. బుధవారం పౌర్ణమి ఉండడంతో పాటు బాలాజీ జెండా ఊరేగింపు ఉంటుంది. కాబట్టి జెండా పండగ కు ముందే గణేష్ నిమజ్జనం జరపడం ఆనవాయితీ గా వస్తుంది అని తెలియజేశారు. అందుకే మంగళవారం 11వ రోజు శోభాయాత్ర నిర్వహించడానికి నిర్ణయించడం జరిగిందన్నారు.