నిమజ్జనోత్సవం శాంతి యుతవాతావరణం లో జరుపుకోవాలి

– జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల
– సర్వజనిక్ గణపతికి పూజలుచేసిన జిల్లాఎస్పీ 
– నిమజ్జనం కు రూటుమ్యాప్ పరిశీలన
– ముధోల్ లో నేడు నిమజ్జనోత్సవం..
నవతెలంగాణ -ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోశుక్రవారం గణేశ్ నిమజ్జనం జరుగనున్న నేపథ్యంలో గురువారం శోభ యాత్ర జరుగనున్న రూటు మ్యాప్ ను జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల పరిశీలించారు.  బైంసా ఆడిషినల్ ఎస్పీ అవినాష్ కుమార్ ,సిఐ మల్లేష్, ఎస్సై సాయికిరణ్ లకు పలు సలహా సూచనలను తెలియజేశారు .అనతరం ముధోల్ లోని రాం మందీరంలో ఏర్పాటు చేసిన సర్వజనిక్ గణేష్ మండపం వద్ద ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు.ఈసందర్భంగానిర్వాహకులు,ఉత్సవకమిటీసభ్యులను ఘనంగాసన్మానించారు. గురువారం జరిగే నిమజ్జనోత్సవం కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగా కుండా 200మంది పోలీసు బందోబస్తు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రశాంత వాతావరణం లో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలన్నారు. శుక్రవారం ముదోల్ లో గణేశ్ నిమజ్జనంకు పకడ్బందీ చర్యలను చేపట్టామని, అందరు   సహకరించాలని జిల్లా ఎస్పీ  కోరారు. ముదొల్ లో గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గంలను ఎస్పి పరిశీలించారు.
పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమర్జనం పూర్తి అయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. నిమజ్జనం  ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా భద్రత పరమైన అన్ని చర్యలను చేపట్టామని, చెప్పారు .అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లు ను నిమజ్జనం ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గం లో  ఇతర శాఖ ల యొక్క సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన  చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.  సందర్భంగా అధిక సౌండ్ నిచ్చే డీజే లు,  బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదనితెలిపారు.ముఖ్యంగా యువకులు నిమజ్జనం సమయంలో సంయమనం  పాటించాలని ఊర్లలోని పెద్దలు పిల్లలకు తెలియజేసి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు.  చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక నిమజ్జనం శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐమల్లేష్, ఎస్ఐ సాయికిరణ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రోళ్ల రమేష్,గౌరవ అధ్యక్షుడు సుదర్శన్, సభ్యులు కోరి పోతన్న,తాటివార్ రమేష్,సాయినాథ్, మోహన్ యాదవ్,జి.నారాయణ,  ధర్మేంద ర్ దేశ్ ముఖ్, పూజారి మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love