నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యాశాఖ ను ఉపాద్యాయులు కొరత వేదిస్తున్నది.ఈ కొరత పదో తరగతి ఫలితాలు పై ప్రభావం చూపుతుంది.ఏ సబ్జెక్టు టీచర్లు లేరో అదే సబ్జెక్టులో ఈ ఏడాది విద్యార్ధులు ఫెయిల్ అవడం దీనికి మంచి ఉదాహరణ. విద్యాశాఖ మండల అధికారి క్రిష్ణయ్య తెలిపిన వివరాలు ప్రకారం. మండలంలో మొత్తం 97 పాఠశాలలు ఉన్నవి.
ప్రాధమిక పాఠశాలలు 45
గిరిజన ప్రాధమిక పాఠశాలలు 21
ప్రాధమిక ఉన్నత పాఠశాలలు 13
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 06
ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 06
ఆశ్రమ ప్రాధమిక పాఠశాలలు 02
బీ.సీ పాఠశాల 02
ఎయిడెడ్ పాఠశాల 01
మైనార్టీ పాఠశాల 01
అయితే ఈ పాఠశాలలకు మొత్తానికి మండలంలో మంజూరైన ఉపాద్యాయ పోస్టులు 255 కాగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాద్యాయులు 204 మంది.ఇంకా భర్తీ కావాల్సి ఉన్నవి 51 పోస్టులు.అయితే ఈ ఖాలీ లను ఎంపీడీఓ నింపుతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సబ్జెక్టు మంజూరు వర్కింగ్ ఖాలీ
గ్రేడ్ 2 హెచ్ ఎం 04 01 03
ఎస్ ఎ (మాథ్స్) 16 10 06
ఎస్ ఎ (పి.ఎస్) 12 11 01
ఎస్ ఎ (బి.ఎస్) 13 08 05
ఎస్ ఎ (ఎస్ ఎస్) 17 09 08
ఎస్ ఎ (తెలుగు) 03 02 01
ఎస్ ఎ (ఇంగ్లీష్) 13 11 02
పీఎస్ హెచ్ ఎం (టి) 11 04 07
ఎస్ జి టి(తెలుగు) 132 114 18
వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ 02 —- —
మొత్తం 255 204 51
గతేడాది విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలు ఉపాద్యాయులు కొరత ను వెక్కిరిస్తున్నాయి.ఇందులో మొత్తం 43 మంది ఫెయిల్ అయితే అత్యధికులు గణితం,సోషల్ స్టడీస్ లో తప్పిన వారే కావడం గమనార్హం.సబ్జెక్టు వారీ ఉపాద్యాయులు కొరత లోను వీరే అధికంగా ఉండటం విశేషం.
ఫెయిల్ అయిన సబ్జెక్టులు విద్యార్ధులు వివరాలు:
సబ్జెక్టు ఫెయిల్
తెలుగు 06
ఇంగ్లీష్ 03
గణితం 26
సైన్స్ 01
సోషల్ స్టడీస్ 20
మొత్తం 56
ఈ మండలంలో ఉన్న గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుడు క్రిష్ణయ్య నారాయణపురం పాఠశాల లో విధులు నిర్వహిస్తూ అశ్వారావుపేట,గుండాల,ఆళ్ళపల్లి మండలాలకు మండల విద్యాశాఖాధికారి గా వ్యవహరిస్తూ విధులు భారాన్ని మోస్తూ వ్యయ,మనోవేదనను అనుభవించడం బాధాకరం.
మండలంలో ఖాలీ లను భర్తీ చేసి,ఈ మండలానికే పరిమితం అయ్యేలా మండల విద్యాశాఖాధికారి గా పరిమితులు విధించాలని ఎస్.ఎం.సి చైర్మన్ లు,తల్లిదండ్రులు,పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.